తిరుపతి ఓజిలి నేషనల్ హైవే పై ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు దగ్ధం
మంటల్లో పూర్తిగా కాలిపోయిన బస్సు, ప్రయాణికులు సురక్షితం
తిరుపతి జిల్లా నాయుడుపేట–చెన్నై జాతీయ రహదారి 16పై తెల్లవారుజామున ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు.
ఓజిలి–రాచపాళెం చెరువు కల్వర్టు సమీపంలో, చెన్నై వైపు వెళ్లే మార్గంలో తెల్లవారుజామున సుమారు 2 గంటల నుంచి 2:15 గంటల మధ్య ఈ ఘటన చోటుచేసుకుంది.
కామాక్షి ప్రైవేట్ ట్రావెల్స్‌కు చెందిన AR 01 S 6404 నంబర్ గల బస్సు రేపల్లె నుంచి బెంగళూరుకు ప్రయాణిస్తోంది. బస్సులో 19 మంది ప్రయాణికులతో పాటు ఇద్దరు డ్రైవర్లు, ఒక క్లీనర్ ఉన్నారు.
బస్సులో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది. మంటలను గమనించిన డ్రైవర్ అప్రమత్తమై వెంటనే బస్సును నిలిపివేసి, ప్రయాణికులతో పాటు ఇతర సిబ్బందిని సురక్షితంగా కిందకు దించారు.
దీంతో పెను ప్రమాదం తప్పింది. అనంతరం ప్రయాణికులను మరో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో వారి గమ్యస్థానాలకు పంపించారు.
మంటలు చెలరేగిన బస్సును రహదారి పక్కకు నిలిపివేయడంతో కొద్దిసేపు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. సమాచారం అందుకున్న
