మనకు ఉన్న అవకాశాలను అన్ లాక్ చేయగలిగాం. ప్రతీ శాఖలోనూ సంస్కరణలు తీసుకువచ్చాం.

• గత ప్రభుత్వం నిర్వాకంతో మార్కెట్టులోకి వచ్చిన జే బ్రాండ్ మద్యం వల్ల 30 వేల మంది చనిపోయారు. వారి ఆరోగ్యం కూడా దెబ్బతింది.

• కల్తీ బ్రాండ్లన్నీ రద్దు చేసి పారదర్శకంగా విక్రయాలు జరిగేలా చూస్తున్నాం.

• విద్యుత్ టారిఫ్ పెంచకుండా... నాణ్యమైన విద్యుత్ పంపిణీ చేస్తున్నాం.

• ప్రతీ నెలా ఆర్దిక నివేదికను విడుదల చేసి ఎప్పటికప్పుడు లక్ష్యాలను బేరీజు వేసుకుంటున్నాం.

• ప్రతీ మూడు నెలలకూ జీఎస్డీపీని కూడా లెక్కించి ప్రగతిలో ఎక్కడ ఉన్నామో చూస్తున్నాం.

• 2022-23 బేస్ ఇయర్ గా ప్రస్తుత ధరలకు అనుగుణంగా 13.44 శాతం వృద్ధి రేటు నమోదైంది.

• తయారీ రంగంలోనూ అభివృద్ధి నమోదు అయ్యింది.

• జీఎస్టీ కలెక్షన్స్ కూడా గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది రూ.25,450 కోట్ల మేర పెరిగింది.

• మనకు వనరులు ఉన్నాయి. టెక్నాలజీ  అందుబాటులో ఉంది. కానీ కొన్ని చోట్ల లీడర్షిప్ లోపం ఉంది.

• ఉద్యోగుల సామర్ధ్యం పెంపు కోసం వివిధ కోర్సులు కూడా నిర్వహిస్తున్నాం.

• ఇప్పటి వరకూ 1.50 కోట్ల కోర్సులను సామర్ధ్యాలను పెంచేందుకు నిర్వహించాం.

• డీప్ టెక్ గవర్నెన్సు ఉంటే అనూహ్యమైన ఫలితాలను సాధించేందుకు అవకాశం ఉంది.

• టెక్నాలజీని వినియోగించడం ద్వారా డేటా లేక్, అవేర్ లాంటి వ్యవస్థలతో నిర్ణయాల్లో వేగం పెరగాలి... సేవల్లో నాణ్యత పెంచాలి.

• గతంలో 50 ఏళ్లలో చేసే అభివృద్ధిని ఇప్పుడు 10-15 ఏళ్లలోనే సాధించేందుకు ఆస్కారం ఉంది.

• రియాక్టివ్ గవర్నెన్సు కంటే ప్రో యాక్టివ్ గవర్నెన్సు ఉండాలి.

• ఫైళ్లు పెండింగ్ లో ఉన్నాయంటే అంటే అభివృద్ధి-పాలన పెండింగ్ లో ఉన్నట్టే.

• ప్రభుత్వ సేవలు సక్రమంగా అందినప్పుడే ప్రజల నుంచి సానుకూల స్పందన ఉంటుంది.

• ఈ ఏడాది తీవ్రమైన ఎల్ నినో కారణంగా నీటి భద్రత ఓ సవాలుగా మారింది.

• 54 శాతం లోటు వర్షపాతం ఈసారి రాష్ట్రంలో నమోదైంది