ప్రొద్దుటూరు పట్టణం పింఛన్లకు దరఖాస్తు చేసుకోండి. కమీషనర్ శ్రీనివాస విశ్వనాధ్
అర్హత కలిగిన ఒక్క లబ్దిదారుడు నష్టపోకూడదని సచివాలయం సిబ్బందికి కమీషనర్ ఆదేశం
ప్రొద్దుటూరు : ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పింఛన్ పథకానికి అర్హులైన లబ్దిదారులు దరఖాస్తులు చేసుకోవాలని కమీషనర్ తూతిక శ్రీనివాస విశ్వనాధ్ సూచించారు. నిరుపేదలకు సామజిక భద్రత కల్పించే లక్ష్యంతో ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా ఆన్ లైన్ పోర్టల్ ను ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చిందని ఈ నెల సెప్టెంబర్ 7 నుండి 16 తేదీ వరకు దరఖాస్తు చేసుకోవడానికి ప్రభుత్వం అవకాశం కల్పించిందని, గడువులోపు దరఖాస్తు చేసుకోవాలని కమీషనర్ అన్నారు. అర్హులైన 60 సంవత్సరాలు దాటినా వృద్దులతో పాటు చేనేత కార్మికులు, వితంతువులు, ఒంటరి మహిళలు, డప్పు కళాకారులు, చర్మకారులు, దివ్యాంగులు, గీత కార్మికులు, మత్సకారులు, ట్రాన్సజెండర్స్ సంబంధిత దస్త్రాలతో వార్డు సచివాలయానికి వెళ్లి దరఖాస్తు చేసుకోవాలని కమీషనర్ కోరారు. సందర్బంగా కమీషనర్ శ్రీనివాస విశ్వనాధ్ టెలీకాన్ఫెరెన్స్ ద్వారా సచివాలయం సిబ్బందికి ఆదేశాలు జారీ చేస్తూ అర్హత ఉన్న ఒక్క లబ్దిదారుడు నష్టపోకూడదని అన్నారు.
