ప్రయాగ్ రాజ్-విశాఖపట్నం ప్రత్యేక రైలును ఉద్దేశపూర్వకంగా గంటల తరబడి ఆలస్యం చేసి రద్దు చేశారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. నార్త్ సెంట్రల్ రైల్వే ప్రయోగాత్మకంగా ప్రారంభించిన ఈ రైలు, ఇతర జోన్ల పరిధిలో సరైన లైన్ క్లియరెన్స్ లేక 15 గంటలకు పైగా ఆలస్యమవడంతో రద్దయింది. కేవలం మూడు ట్రిప్పులకే ఇది రద్దు కావడంపై ప్రయాణికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎంపీలు సీఎమ్ రమేష్, శ్రీభరత్ స్పందించి రైలును పునరుద్ధరించాలని ప్రయాణికులు కోరుతున్నారు.