అక్రమ ఇసుక రవాణాకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా సంబంధిత అధికారులను ఆదేశించారు.
ఇసుక అక్రమ రవాణాకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా సంబంధిత అధికారులను ఆదేశించారు.
శనివారం సాయంత్రం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఇసుక అక్రమ రవాణా నియంత్రణ చర్యలు, భూముల రీ సర్వే, ఇతర రెవెన్యూ అంశాలపై సంబంధిత అధికారులతో కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వెంకట మాధవ రావు, భైంసా సబ్ కలెక్టర్ అజ్మీరా సంకేత్ కుమార్, ఆర్డీవో దేవీదాస్, డిప్యూటీ కలెక్టర్ రాకేష్, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
