*మార్కెట్లో బియ్యం ధరల నియంత్రణపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.* 🔹 సాధారణంగా వినియోగించే BPT బియ్యం ధర కిలోకు గరిష్ఠంగా ₹66గా నిర్ణయం. 🔹 అక్రమ నిల్వలు, అధిక ధరల విక్రయాలపై 12 కేసులు నమోదు. 🔹 హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో ఐదు శాఖల సంయుక్త దాడులు. 🔹 రాష్ట్రంలో బియ్యం నిల్వలు సరిపడా ఉన్నాయని, ప్రజలు ఆందోళన చెందవద్దని మంత్రి భరోసా. _________________________________ మార్కెట్లో బియ్యం ధరల నియంత్రణపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సాధారణ ప్రజలు అత్యధికంగా వినియోగించే బీపీటీ (BPT) రకం బియ్యం గరిష్ట విక్రయ ధరను కిలోకు రూ.66గా ఖరారు చేస్తూ రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి శుక్రవారం అధికారికంగా ప్రకటించారు. మిల్లర్లు, వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టించినా, అక్రమ నిల్వలకు పాల్పడినా, అధిక ధరలకు విక్రయించినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.