రైతుల సంక్షేమమే అగ్రిస్టాక్ కమిటీ లక్ష్యం అధికారులు సమన్వయంతో పనిచేయాలి:
నిర్మల్ జిల్లా కలెక్టరేట్‌లో శనివారం జిల్లా స్థాయి అగ్రిస్టాక్ టాస్క్ ఫోర్స్ కమిటీతో కలెక్టర్ భవేశ్ మిశ్రా సమీక్ష నిర్వహించారు. వ్యవసాయ రంగంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని, డిజిటల్ సేవలను విస్తృతంగా వినియోగించాలని అధికారులకు సూచించారు. ప్రభుత్వ వ్యవసాయ పథకాలు అర్హులైన రైతులందరికీ పారదర్శకంగా అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వ్యవసాయ సమస్యలను గుర్తించి, సంబంధిత శాఖలు సమన్వయంతో పరిష్కరించాలని తెలిపారు. వ్యవసాయ సమాచారాన్ని ఎప్పటికప్పుడు సేకరించి, కచ్చితమైన డేటాను నిర్వహించాలని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు వెంకట మాధవరావు, రాథోడ్ రమేష్‌తో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
