ఇందిరా గాంధీ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు
భారత మాజీ ప్రధానమంత్రి ఇందిరా గాంధీ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు.
భారత మాజీ ప్రధానమంత్రి, ఉక్కు మహిళగా పేరుగాంచిన స్వర్గీయ శ్రీమతి ఇందిరా గాంధీ గారి వర్ధంతి సందర్భంగా నిర్మల్ పట్టణంలోని గౌరవ శ్రీ కూచాడి శ్రీహరి రావు గారి క్యాంపు కార్యాలయంలో ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా శ్రీ కూచాడి శ్రీహరి రావు గారు మాట్లాడుతూ...
భారతదేశ చరిత్రలో ఇందిరా గాంధీ గారికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉందని, దేశ తొలి మహిళా ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టి ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూ దేశ పరిపాలనలో తనదైన ముద్ర వేశారని పేర్కొన్నారు.
. బ్యాంకుల జాతీయీకరణ, రాజభరణాల రద్దు వంటి కీలక నిర్ణయాలతో దేశ ఆర్థిక, సామాజిక రంగాల్లో అనేక మార్పులకు శ్రీకారం చుట్టారని గుర్తు చేశారు.
పేదలు, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా ఆమె ప్రవేశపెట్టిన కార్యక్రమాలు భారత రాజకీయ చరిత్రలో ప్రత్యేక గుర్తింపు పొందాయని తెలిపారు. .
