జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రాపై చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ శనివారం టీజీఈజేఈసీ, పెన్షనర్ల సంఘాల నాయకులు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. అనంతరం కలెక్టరేట్‌లో కలెక్టర్‌ను కలిసి సంఘీభావం ప్రకటించారు. జిల్లా అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం కృషి చేస్తున్న అధికారిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకుని బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఉద్యోగుల ఆత్మగౌరవానికి భంగం కలిగించే చర్యలను సహించబోమని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఉద్యోగ, పెన్షనర్ల సంఘాల నాయకులు, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.