ఉపాధి కూలీల సమస్య నవంబర్ 6న ధర్నా
ఉపాధి హామీ కూలీల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ వచ్చే నెల నవంబర్ 6న హైదరాబాద్‌లోని కమిషనర్ కార్యాలయం ఎదుట నిర్వహించను ధర్నా ను జయప్రదం చేయాలని నాయకులు పిలుపునిచ్చారు. నిర్మల్ (Nirmal) జిల్లా కేంద్రంలోని వ్యవసాయ కార్మిక సంఘం కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ధర్నాకు సంబంధించిన అంశాలపై చర్చించారు.
ఈ సందర్భంగా సంఘం జిల్లా అధ్యక్షుడు డాకూర్ తిరుపతి, జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం నూతన్‌కుమార్ మాట్లాడుతూ.. పట్టణాల్లోనూ ఉపాధి హామీ పనులు కల్పించాలని డిమాండ్ చేశారు. ఉపాధి కోరిన ప్రతి ఒక్కరికీ జాబ్ కార్డు ఇవ్వాలని, గ్రామాల్లో వెంటనే పనులు ప్రారంభించాలని కోరారు. కూలీలకు రోజుకు రూ.800 వేతనం చెల్లించాలని, పెరుగుతున్న ధరలకుఅనుగుణంగా నెలలకు రూ.26 వేల వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇతర ఉపాధి హామీ సమస్యల పరిష్కారం కోసం నిర్వహించే ధర్నాకు కూలీలు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు.
