విబిజి రామ్ జీ పథకం అమలుపై సంబంధిత అధికారులతో కలెక్టర్ సమీక్ష సమావేశం.
విబిజి రామ్ జీ పథకం ద్వారా జాబ్ కార్డులు కలిగిన అర్హులందరికీ ఉపాధి కల్పించేలా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు. పథకం కింద చేపట్టే పనులను ప్రణాళికాబద్ధంగా గుర్తించి, అర్హులైన ప్రతి కుటుంబానికి ఉపాధి అవకాశాలు కల్పించాలన్నారు.
మంగళవారం సాయంత్రం కలెక్టరేట్ సమావేశ మందిరంలో విబిజి రామ్ జీ పథకం అమలుపై సంబంధిత అధికారులతో కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు.
సమావేశంలో ఇన్చార్జి స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాథోడ్ రమేష్, డీఆర్డీఓ విజయలక్ష్మి, డీపీఓ శ్రీనివాస్, ఆర్డబ్ల్యూఎస్, పీఆర్ ఈఈలు సందీప్, తుకారాం, ఆయా మండలాల ఎంపీడీఓలు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
