16వ రోజుకు చేరిన NHM ఉద్యోగుల ఆందోళన: 'వంటా-వార్పు'తో వినూత్న నిరసన
నేషనల్ హెల్త్ మిషన్ (NHM) జాయింట్ యాక్షన్ కమిటీ (JAC) ఆధ్వర్యంలో ఆరోగ్య శాఖ కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు చేపట్టిన నిరసన సమ్మె 16వ రోజుకు చేరుకుంది. తమ సమస్యలను పరిష్కరించాలని మరియు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన ఈ ఆందోళన కార్యక్రమాల్లో భాగంగా, 16వ రోజున ఉద్యోగులందరూ రోడ్లపైకి వచ్చి వినూత్నంగా 'వంటా-వార్పు' కార్యక్రమాన్ని నిర్వహించారధర్నా శిబిరాల వద్దే రోడ్డుపై పొయ్యిలపై వంటలు వండుతూ ఉద్యోగులు తమ ఆవేదనను వ్యక్తం చేశారు. ప్రాణాలు పణంగా పెట్టి వైద్య సేవలు అందించిన తమను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు.తక్షణమే ప్రభుత్వం చర్చలు జరిపి న్యాయం చేయాలని కోరారు.
