మహారాష్ట్రలోని చంద్రపూర్ భెందాలా గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. ఆదివారం పొలంలో నువ్వుల పంట కోస్తున్న అంగన్‌వాడీ టీచర్ ప్రేమిలా పుండలిక్ మహడోరే (50)పై పులి దాడి చేసింది. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనతో గ్రామస్థులు భయాందోళనకు గురయ్యారు. పొలాలకు వెళ్లాలంటేనే రైతులు, కూలీలు వణికిపోతున్నారు. సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు, పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు.