13వ రోజు NHM ఉద్యోగుల నిరవదిక సమ్మె...... నిర్మల్ జిల్లా NHM జేఏసీ
తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించే వరకు నిరవధిక సమ్మెను ఆపేది లేదని ఎన్హెచ్ఎం.. నిర్మల్ జిల్లా NHM జేఏసీ ఉద్యోగులు తేల్చి చెప్తున్నారు. ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతున్నట్లు పేర్కొంటున్నారు. ప్రభుత్వం పరిష్కరించే డిమాండ్లను మాత్రమే తాము అడుగుతున్నట్టు ఉద్యోగులు తెలిపారు. అయితే ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో ఉద్యోగుల్లో అసంతృప్తి నెలకొంటుంది. సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, ఎన్హెచ్ఎం ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. ఉద్యోగులందరికీ హెల్త్ ఇన్సూరెన్స్ అమలు చేయాలని కోరుతున్నారు.
