న్యాయపరమైన చిక్కులు లేకుండా నివాసయోగ్యమైన ప్రాంతంలో స్థలాలు ఇచ్చేందుకు కార్యాచరణ జరుగుతుంది జర్నలిస్టుల సంక్షేమానికి ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉంది అన్నారు తెలంగాణ రాష్ట్రంలో గత కొన్ని సంవత్సరాలుగా ఇళ్ల స్థలాల కోసం ఎదురుచూస్తున్న జర్నలిస్టుల ఆకాంక్షలను తమ ప్రభుత్వం నెరవేరుస్తుందని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు స్పష్టం చేశారు. జర్నలిస్టులకు చట్టపరమైన చిక్కులు లేని విధంగా, నివాసయోగ్యమైన ప్రాంతంలో ఇళ్ల స్థలాలు అందించేందుకు ప్రభుత్వం కార్యాచరణ రూపొందిస్తోందని శ‌నివారం విడుద‌ల చేసిన ఒక ప్ర‌క‌ట‌న‌లో వెల్లడించారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి గారి హయాంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2008లో జర్నలిస్టు హౌసింగ్ సొసైటీకి భూములు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయని మంత్రి గుర్తుచేశారు.