BSNL కొత్త ఆఫర్.. ఓటీటీలను ఎంచుకునే అవకాశం ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ BSNL తన భారత్ ఫైబర్ వినియోగదారుల కోసం 'బై యువర్ ఓన్ (BYO) ఓటీటీ బిల్డర్' సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది. దీని ద్వారా వినియోగదారులు 25కు పైగా ఓటీటీ యాప్స్ నుంచి తమకు నచ్చిన వాటిని ఎంచుకోవచ్చు. రూ.549 నుంచి రూ.999 వరకు వివిధ డేటా ప్లాన్లను సంస్థ ప్రవేశపెట్టింది. వేగవంతమైన ఇంటర్నెట్తో పాటు తమకు ఇష్టమైన డిజిటల్ వినోదాన్ని కస్టమైజ్ చేసుకునే వెసులుబాటును కస్టమర్లకు కల్పించింది. మరిన్ని వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్ను సందర్శించవచ్చు.