సాగుభూమి సంరక్షణ కార్యక్రమం:ఉట్నూర్
ఈ రోజు 10:30 నిమిషాలు నుంచి ఉట్నూర్ రైతు వేదికలో సాగుభూమి సంరక్షణ కార్యక్రమం చేపట్టారు. ఉట్నూర్ క్లస్టర్ లోనీ ఉట్నూర్, ఘనపూర్, లక్కారం, కొత్తగూడ, హీరాపూర్ జె, దొంగచింత, నర్సాపూర్ జె సర్పంచులు మరియు గ్రామ పంచాయతీ కార్యదర్శులు ,AEO రమేష్, దంతనపల్లి ఏ.వో నిఖిల్, ఉట్నూర్ రెవెన్యూ అధికారీ డిప్యూటీ తహసీల్దార్ పాల్గొన్నారు. మంత్రి వర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొనీ ఏలీనో ప్రభావం పై వివరించారు.. రైతులకు రెండవ పంట పై అవగాహన కల్పించాలని కోరారు. నీటి ఎద్దడి పై ఎప్పటికప్పుడు సమాచారం ఇవ్వాలని అధికారులకు కోరారు.ఉన్న పంటను సరిగా కాపాడమని రైతులను కోరారు..
