మదనపల్లె పట్టణంలో లేడీ డాన్ గా పేరుందిన కోనేటి సులోచన ఇంట్లో శనివారం పోలీసులు మెరుపు దాడులు చేశారు. 

ఓ మాజీ మంత్రి ముఖ్య అనుచరుడైన కీలక వ్యక్తితో చేతులు కలిపి 100ల కోట్లు విలువైన భూములను అక్రమంగా కాజేసిన వ్యవహారంలో కోర్టు ఆదేశాల మేరకు ఈ తనిఖీలు జరిగాయి. 

మదనపల్లి డిఎస్పి బుచ్చిరాజు ఆధ్వర్యంలో సిఐలు మోహన్ కుమార్,రాజారెడ్డి,మహమ్మద్ రఫీలతో కూడిన మూడు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి సులోచన నివాసంతో పాటు ఆమె సోదరుడు శ్రీనివాసులు ఇంటిలో ప్రతి మూలను తనిఖీ చేశారు. 

ఈ సోదాల్లో పోలీసులు 50 రకాల ఆస్తి పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. 15 ఫోర్జరీ సంతకాలు చేసి ఉంచిన పాత కాళీ బాండ్ పేపర్లను పోలీసులు గుర్తించారు. 

అమాయకులకు అప్పులు ఇచ్చినట్లు నమ్మించి వారి నుంచి బలవంతంగా కాలి బాండ్లపై సంతకాలు తీసి ఆస్తులు లాక్కోవడానికి వీటిని ఉపయోగించినట్లు దర్యాప్తులో తేలింది. 

స్వాధీనం చేసుకున్న పత్రాలను సమగ్ర విశ్లేషణ కోసం పోరాన్శిక్ సైన్స్ లాబరేటరీ కి పంపినట్లు డిఎస్పీ తెలిపారు.

   రూ వందల కోట్లు దందాలు

సాధారణ వ్యవసాయ కూలీ.. చిన్న గదిలో ఉండే ఆమె మాజీ మంత్రి ప్రధాన అనుచరుడి సాయంతో వైకాపా హయాంలో డాన్ గా ఎదిగింది. 

ఆమె పేరు మీద బండ కమ్మ మీద పల్లెలో రూ 60కోట్లు విలువైన 502చ గజాల స్థలం, భవనం, పొన్నూటిపాళ్యంలో 1.75ఎకరాలు భూమి కొన్నట్లు రికార్డులు ఉన్నాయి. 

ఫోర్జరీ పవర్ ఆఫ్ అటార్నీ దస్తావేజులు ఉపయోగించి  47సెంట్లు (విలువ రూ. 10కోట్లు ) భూమిని ఆక్రమించుకుని దీన్ని మాజీ మంత్రి భార్య పేరుగా మదనపల్లి సబ్ రిజిస్టర్ కార్యాలయం ద్వారా గిఫ్టెడ్ గా పొందారు. 

ఈ రిజిస్ట్రేషన్ 2023 జూన్ 13న జరిగింది. వైకాపా హయాంలో అధికారపాలంతో సాగించిన ఈ  రూ. కోట్లాది విలువైన భూముల దోపిడీపై బాధితుడిచ్చిన ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు.

విజయవాడలో జాబితా అందజేత.

పోలీస్ దాడుల సమయంలో సులోచన ఇంట్లో లేదు ప్రస్తుతం ఆమె విజయవాడలో ఉన్నట్లు గుర్తించిన పోలీసులు, స్వాధీనం చేసుకున్న పత్రాలు వివరాలను ఇంట్లో ఉన్న ఆమె పిల్లలకు అందించారు. 

బాధితుడు మార్పు వెంకటేష్ నాయుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కోర్టు జారీ చేసిన చర్చ్ వారంటూ ఆధారంగా ఈ తనిఖీలు నిర్వహించినట్లు సమాచారం. 

సులోచన పై ఇప్పటికే ఒకటి,రెండు పట్టణం మదనపల్లి తాలూకా పోలీస్ స్టేషన్లో 14 క్రిమినల్ కేసులు, రౌడీ షీట్ తెరవడం వంటివి ఉన్నాయి.