బోలారంలో జరిగిన ఆర్మీ ఆయుధాల చోరీ కేసును మల్కాజ్‌గిరి పోలీస్ జోన్ పరిధిలోని పోలీసులు ఛేదించారు. ఈ భారీ దొంగతనంలో డిపార్ట్‌మెంట్‌కు చెందిన నలుగురు మద్రాస్ రెజిమెంట్ సైనికులే నిందితులుగా తేలడంతో వారిని అదుపులోకి తీసుకున్నారు. కాగా సంచలనం సృష్టించిన ఈ కేసు వివరాలను తెలంగాణ డిజిపి సివి ఆనంద్ ఈరోజు సాయంత్రం నాలుగు గంటలకు మీడియా సమావేశంలో వెల్లడించనున్నట్లు తెలిపారు