ఏసీబీ అధికారులు అంటూ గొల్లప్రోలు రెవెన్యూ అధికారులకు సైబర్ కేటుగాళ్లు నిన్న ఫోన్లు చేసి బెదిరించిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఒక అధికారి ఇంటికి ACB అధికారులమంటూ కొందరు కారులో వెళ్లి సోదాలు కూడా నిర్వహించినట్లు సమాచారం. గొల్లప్రోలు VRO రూ.లక్ష 30 వేలు ఫోన్ పే ద్వారా చెల్లించి మోసపోయారు. సైబర్ కేటుగాళ్ల పక్కా సమాచారంతో వల వేయడంతో పలువురు అధికారులు పెద్ద మొత్తంలో సొమ్ములు చెల్లించినట్లు సమాచారం.