పర్యావరణ పరిరక్షణ కోసం ప్లాస్టర్‌ ఆఫ్‌ పారిస్‌ విగ్రహాలకు బదులుగా మట్టి వినాయక విగ్రహాలను పూజించాలని మదనపల్లె సబ్‌కలెక్టర్‌ చల్లా కళ్యాణి సూచించారు. మదనపల్లి  రెడ్డప్ప నాయుడు కాలనీలో కాలుష్య నియంత్రణ మండలి ప్రాంతీయ కార్యాలయం, కడప ఆధ్వర్యంలో ఉచిత మట్టి విగ్రహాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులకు విగ్రహాలను పంపిణీ చేసిన సబ్‌కలెక్టర్‌, రసాయన రంగులు, పీఓపీ విగ్రహాలకు దూరంగా ఉండాలని కోరారు.

కార్యక్రమంలో కాలుష్య నియంత్రణ మండలి ఈఈ సుధా, అధికారులు, సిబ్బంది, స్థానికులు పాల్గొన్నారు.