ఉల్లి ధరలు రోజురోజుకు పై పైకి పోతున్నాయి,నెల క్రితం రూ"30 పలికిన కిలో ఉల్లి ఇప్పుడు రూ"70 కి చేరింది, డిమాండ్ కు తగిన సరఫరా లేకపోవడం తో ధరలు పెరుగుతు న్నాయని వ్యాపారు లు చెబుతున్నారు. హైదరాబాద్ మలక్ పేట హోల్ సేల్ మార్కెట్లో కింటా ఉల్లి ధర గరిష్టంగా 45 వేల నుంచి 52, వేలు పలుకుతుంది, గత నెలతో పోలిస్తే ఇది సుమారు ఎక్కువే...  

ఉల్లిపాయల కోసం తెలంగాణ ఇప్పటికీ ఇతర రాష్ట్రాలపై ఆధారపడుతోంది. మహారాష్ట్ర, కర్ణాటక, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి ఎక్కువగా తెలంగాణ మార్కెట్‌ కు ఉల్లి వస్తోంది. ఆయా ప్రాంతాల్లో ఏ మాత్రం తేడా వచ్చినా, రాష్ట్రంలో ఉల్లి ధరలకు రెక్కలు వస్తాయి. ఇది దృష్టిలో పెట్టుకుని ఉల్లి పంట సాగుపై దృష్టిపెడతామని ప్రభుత్వం, ఉద్యాన వన శాఖ చెబుతున్న ప్పటికీ ఆచరణలోకి రావట్లేదు.

గతంలో రబీ సీజన్‌ లో రంగారెడ్డి, వికారాబాద్, మెదక్, సంగారెడ్డి, మహబూ బ్​నగర్, వనపర్తి, జోగులాంబ గద్వాల, నారాయణ పేట జిల్లాల్లో మొత్తం ఉల్లి సాగు విస్తీర్ణం సుమారు 21,869 ఎకరాల వరకు ఉంటుందని ఉద్యాన శాఖ అంచనా. బాగల్‌కోట్, కర్నూ లు, ఎమ్మిగనూరు, గద్వాల, మహబూబ్‌ నగర్, జహీరాబాద్ తదితర ప్రాంతాల నుంచి కొత్త పంట వస్తే తప్ప అప్పటి వరకు ధరలు పెరుగు తూనే ఉంటాయని వర్తకులు వెల్లడించారు.

సామాన్య ప్రజలపై ఉల్లి భారం

ఒకవైపు చక్కెర ధరలు పెరుగుతుం డగా, మరోవైపు సామాన్యులపై ఉల్లి భారం పడింది. శుభకార్యాలు, పండు గలు రాబోతోన్న వేళ ఉల్లి ధరలు పెరగడం పై కేంద్రం కూడా చర్యలు తీసుకుంటోం ది. మరో నెలన్నర పాటు ఈ ధరలు ఇలాగే కొనసాగే అవకాశం ఉన్నట్లు మార్కెటింగ్ శాఖ విశ్లేషిస్తోంది. 

గత ఏడాది ఆగస్టు మాసంలో 2,54,120 క్వింటాళ్ల ఉల్లిపాయ హైదరాబాద్ మలక్‌పేట టోకు మార్కెట్​కు వచ్చింది. ఈ ఏడాది ఆగస్టులో 1,99,686 క్వింటాళ్లు మాత్రమే వచ్చిందని మార్కెటింగ్ అధికా రులు తెలిపారు. కర్ణాటక, కర్నూల్​, మహారాష్ట్రలో పంట దిగుబడి తగ్గడం, సీజన్​ లేకపోవడం వల్ల ధరలు పెరిగాయి.