గణేష్ ఉత్సవాల్లో డీజేలకు అనుమతి లేదు

తెలంగాణలో గణేష్‌ నవరాత్రి ఉత్సవాల నేపథ్యంలో శబ్ద కాలుష్యంపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోనున్నారు. తెలంగాణ హైకోర్టు ఆదేశాల మేరకు, రాత్రి 10 నుంచి ఉదయం 6 గంటల వరకు డీజేలు, లౌడ్‌ స్పీకర్లపై నిషేధం విధించారు. నివాస ప్రాంతాల్లో 55 డెసిబుల్స్‌, పగటిపూట అనుమతించిన స్థాయిలోనే శబ్దం ఉండాలని ఆదేశించారు. స్కూళ్లు, ఆస్పత్రుల చుట్టూ 100 మీటర్ల పరిధిని నో నాయిస్‌ జోన్‌గా ప్రకటించి, ఈ ప్రాంతాల్లో శబ్దం చేస్తే ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. శబ్ద తీవ్రతను కొలిచేందుకు డెసిబుల్‌ మీటర్లతో ఫ్లయింగ్‌ స్క్వాడ్‌లను రంగంలోకి దించారు.