కళ్ల ముందే కెమెరాలు ఉన్నాయి. మీడియా ఉంది. పోలీసులు, ప్రభుత్వ అధికారులు, శాసనసభ్యులు, పార్టీ నాయకులు, గుమిగూడిన కార్యకర్తలు ఉన్నారు. ఇంతమంది సమక్షంలో విధులు నిర్వర్తిస్తున్న పోలీసుపై దౌర్జన్యం చేయడం, దుర్భాషలాడడం, కాలర్ పట్టుకుని కొట్టేందుకు వెళ్లడం… రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించడం అందరూ చూశారు.

గుమాస్తా తెలంగాణ, మీ తొత్తు మీడియాలకు ఇవేమీ కనిపించకపోయినా… వాస్తవాన్ని మాత్రమే చూపించే మీడియా సంస్థలు, సోషల్ మీడియా పేజీలు మాత్రం అసలు నిజాన్ని బట్టబయలు చేశాయి.. కేటీఆర్!

“ఉల్టా చోర్ కొత్వాల్ కో డాంటే” అన్నట్టుగా… మీరే పోలీసుపై దాడి చేసి, మళ్లీ మీకే దెబ్బ తగిలిందంటూ మీడియా ముందు చూపించేందుకు ఇంజెక్షన్లు తీసుకునే డ్రామాలా? ఎన్నాళ్లు ఈ డ్రామా బ్రతుకు?

పదేళ్ల పాటు లేని అభివృద్ధిని ఉన్నట్టుగా ప్రజలను నమ్మించినంత సులువు కాదు... ప్రజా ప్రభుత్వ పాలనలో మీ అబద్ధాలను నిజాలుగా నమ్మించడం.

బాహాటంగా పట్టుబడిన తర్వాత కూడా “అక్రమ అరెస్టులు, నిర్బంధాలు” అంటూ నీతి కబుర్లు చెప్పడం మీ రాజకీయ వికృత చేష్టలకు నిదర్శనం.

ఒకవైపు, నువ్విచ్చిన అలుసుతో ఎమ్మెల్సీ నవీన్ రెచ్చిపోయి ఏకంగా పోలీసు కాలర్ పట్టుకుని రౌడీలా ప్రవర్తిస్తే… మరోవైపు తాత మధు దళిత స్పీకర్‌ను “వాడు–వీడు” అంటూ సంబోధించడమే కాకుండా, తన స్థాయిని మరిచి అసభ్య భాషతో స్పీకర్ స్థాయిని అవమానించాడు.

ఇవన్నీ ఎవరో కల్పించిన కథలు కావు. కెమెరాల్లో రికార్డైన వాస్తవాలు.

అయినా “నవ్విపోదురు గాక… నాకేటి సిగ్గు” అన్నట్టుగా ఇంకా బుకాయిస్తూ ప్రభుత్వాన్నే నిందిస్తున్నావు.

స్పీకర్‌ను అవమానించిన మీ ఎమ్మెల్సీలకు బుద్ధి చెప్పాల్సింది పోయి, వారిని సమర్థిస్తూ బాధ్యతారహితంగా మాట్లాడటం… అది మీ రాజకీయ సంస్కృతికి అద్దం పడుతోంది.

విలువలు లేని రాజకీయాలను ప్రజలు ఇప్పటికే తిరస్కరించారు.

అయినా అదే పద్ధతిలో ముందుకు వెళ్తున్నారంటే… ప్రజలు ఇచ్చిన తీర్పు నుంచి మీరు ఏమీ నేర్చుకోలేదనీ, ఇంకా బుద్ధి రాలేదని నిన్నటితో తేటతెల్లమైంది.

ప్రజలు మిమ్మల్ని ఎందుకు వెలివేశారో అర్థం చేసుకోకుండా, అదే అహంకారంతో కొనసాగితే… ప్రజలు మీకు రాబోయే రోజుల్లో గతం కన్నా రెండింతలు ఎక్కువే సమాధానం చెప్పుతారు.