ఎల్పీజీ బుకింగ్ పై కేంద్ర కీలక నిర్ణయం!
పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ఎల్పీజీ రీఫిల్ బుకింగ్ గడువును కేంద్ర ప్రభుత్వం 25 రోజులకు కుదించింది. గతంలో పశ్చిమాసియా ఉద్రిక్తతల వల్ల గ్రామీణ ప్రాంతాల్లో 45 రోజుల గడువు ఉండేది. ప్రస్తుతం పరిస్థితులు మెరుగుపడటంతో అన్ని ప్రాంతాల్లోనూ సమానంగా 25 రోజులకు బుకింగ్ సదుపాయం కల్పించాలని ఆయిల్ కంపెనీలను ఆదేశించినట్లు కేంద్ర మంత్రి సురేశ్ గోపీ తెలిపారు.
