రీల్స్ పిచ్చి.. రెండు కాళ్లు విరగ్గొట్టుకున్నాడు

రీల్స్ పిచ్చితో ఓ యువకుడు రెండు కాళ్లు విరగ్గొట్టుకున్న ఘటన ఝాన్సీ (UP)లో జరిగింది. ఫ్రెండ్స్ వీడియో తీస్తుండగా అతడు డ్యామ్పై నుంచి నీటిలోకి బ్యాక్ ఫ్లిప్ స్టంట్ చేశాడు. అయితే వాటర్ లెవెల్ తక్కువగా ఉండటంతో నేరుగా రాళ్లపై పడ్డాడు. ఫ్రెండ్స్ అతణ్ని వెంటనే హాస్పిటల్కు తరలించగా వైద్యులు కాళ్లకు సర్జరీ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరలవుతుండగా కామన్సెన్స్ లేదంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు..