బాసర ట్రిపుల్ ఐటీని సందర్శించిన జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా
బాసర ట్రిపుల్ ఐటీ (ఆర్జియూకేటీ)లో విద్యార్థులకు నీటి ఇబ్బందులు కలగకుండా పటిష్ట చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా తెలిపారు.
సోమవారం ఆయన బాసర ట్రిపుల్ ఐటీని సందర్శించి, నీటి సరఫరా పరిస్థితులను పరిశీలించారు. విద్యార్థులకు నిరంతర నీటి సరఫరా అందేలా అవసరమైన చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో భైంసా సబ్ కలెక్టర్ అజ్మీరా సంకేత్ కుమార్, సంబంధిత అధికారులు, ఐఐఐటీ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
