బాధిత కుటుంబాలను పరామర్శించిన నాయకులు... నిర్మల్ పట్టణంలోని పలు బాధిత కుటుంబాలను సోమవారం మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తి నిర్మల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ శ్రీహరి రావు గారితో కలిసి పరామర్శించారు .డ్యాగవాడకు చెందిన కాంగ్రెస్ నాయకుడు అరే చిరంజీవి గారి తల్లి పోసాని, ముడారపు సోమేశ్ గారి తండ్రి ముడారపు ప్రసాద్ ఇటీవల మరణించిన విషయం తెలుసుకుని వారి గృహానికి వెళ్లి పరామర్శించారు. ఈ సందర్భంగా వారి మృతికి సంతాపం వ్యక్తం చేస్తూ, వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.వెంట కౌన్సిలర్లు పెండం శ్రీనివాస్, నాందేడపు చిన్ను,సారంగాపూర్ మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ అబ్దుల్ హాది, కో ఆప్షన్ మెంబర్ గాజుల రవి, దేవరకోట డైరెక్టర్ ముడారపు గంగాధర్,నాయకులు అడప శ్రీకాంత్, కిషోర్, శివ తదితరులు పాల్గొన్నారు.