NHM ఉద్యోగుల నిరవధిక 12వ రోజు NHM ఉద్యోగుల న్యాయమైన డిమాండ్ల సాధన కోసం NHM JAC ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నిరవధిక సమ్మె నేడు 12వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా NHM ఉద్యోగుల దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారం కావాలని, ఉద్యోగులకు న్యాయం జరగాలని, ప్రభుత్వం తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని.ఉద్యోగుల క్యాడర్ ఫిక్సేషన్‌తో పాటు 100% గ్రాస్ జీతాల చెల్లింపు, సమాన పనికి సమాన వేతనం, ఔట్‌సోర్సింగ్ ఏజెన్సీల రద్దు, SHS ద్వారా స్పర్శ్ విధానంలో నేరుగా జీతాల చెల్లింపు, వార్షిక ఇంక్రిమెంట్లు, లాయల్టీ బోనస్, పెండింగ్ బకాయిల చెల్లింపు, ఉద్యోగ భద్రత, EHS సదుపాయం, మహిళా ఉద్యోగులకు 180 రోజుల వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు వంటి ప్రధాన డిమాండ్లనుప్రభుత్వం మానవతా దృక్పథంతో స్పందించి వెంటనే చర్చలకు పిలిచి సమస్యలను పరిష్కరించాలని NHM జేఏసీ తెలంగాణ విజ్ఞప్తి చేసింది.