మంచిర్యాల జిల్లాలో ఏసీబీ ట్రాప్‌ మంచిర్యాల జిల్లా మోసం గ్రామానికి చెందిన గ్రామ పాలన అధికారి (జీపీఓ) డి. శ్రీనివాస్ రూ.22,000 లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఫిర్యాదుదారుడి తండ్రి పేరు రెవెన్యూ రికార్డుల్లో సరిచేసేందుకు నివేదిక పంపిస్తానని, వ్యవసాయ భూమి వారసత్వ హక్కుల విషయంలో సహాయం చేస్తానని లంచం డిమాండ్ చేసినట్లు అధికారులు తెలిపారు. అక్టోబర్ 29న నిర్వహించిన ట్రాప్‌లో కార్యాలయంలోనే లంచం తీసుకుంటుండగా పట్టుకున్న అధికారులు, ఆయనను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించనున్నట్లు వెల్లడించారు. కేసు దర్యాప్తులో ఉంది. లంచం అడిగితే ఏసీబీకి ఫిర్యాదు చేయండి: 1064 (టోల్‌ఫ్రీ). ఫిర్యాదుదారుల వివరాలు గోప్యంగా ఉంచుతామని అధికారులు తెలిపారు.