హైదరాబాద్‌లోని చిక్కడపల్లిలో సంచలన ఘటన చోటుచేసుకుంది. యువతిపై అత్యాచారయత్నానికి పాల్పడేందుకు ప్రయత్నించాడనే ఆరోపణలతో డీఆర్‌డీఓ ఉద్యోగి రామ్మోహన్‌పై గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేసినట్లు సమాచారం. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన రామ్మోహన్ మృతి చెందినట్లు తెలుస్తోంది. ఘటనపై సమాచారం అందుకున్న చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దాడికి గల కారణాలు, ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. నిందితులను గుర్తించేందుకు పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.