అక్రమ మద్యం, నగదు రవాణాపై నిఘా.. ఎస్సై క్రాంతి కుమార్ హెచ్చరిక. ఏలూరు జిల్లా ..! జీలుగుమిల్లి మండలం తాటియాకులగూడెం వద్ద ఆంధ్ర–తెలంగాణ సరిహద్దు చెక్‌పోస్ట్‌లో పోలీసులు, ఎక్సైజ్ శాఖ సిబ్బంది తనిఖీలు నిర్వహించారు. జీలుగుమిల్లి ఎస్సై వి. క్రాంతి కుమార్ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ తనిఖీల్లో తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్‌లోకి అక్రమంగా మద్యం తరలించకుండా, ఎన్నికల కోడ్ నిబంధనలకు విరుద్ధంగా నగదు రవాణా జరగకుండా అధికారులు నిఘా ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎస్సై వి. క్రాంతి కుమార్ మాట్లాడుతూ, ఎన్నికల కోడ్ నిబంధనలను ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని సూచించారు. తెలంగాణ నుంచి అక్రమంగా మద్యం తరలించినా, ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా నగదు రవాణా చేసినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సరిహద్దు ప్రాంతాల్లో నిరంతరం తనిఖీలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు.