ఇండోనేషియాలోని 'అనక్ క్రాకటౌ' అగ్నిపర్వతం ఆదివారం తెల్లవారుజామున బద్దలైంది. ఈ విస్ఫోటనం వల్ల 50,000 అడుగుల ఎత్తుకు పొగ, బూడిద ఎగసిపడి రాజధాని జకార్తా సహా పలు ప్రాంతాలను కప్పేసింది. 

ఈ కారణంగా సోకర్నో-హట్టా విమానాశ్రయంలో 209 విమానాల రాకపోకలు స్తంభించాయి, 22,800 మంది ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. 

ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ముందస్తు జాగ్రత్తగా అధికారులు పర్వతం సమీపంలో సందర్శకులు, పర్యాటకులపై నిషేధం విధించారు....