గద్వాల: తెలంగాణ రక్షణ సేన (టీఆర్‌ఎస్‌) జోగులాంబ గద్వాల జిల్లా అధ్యక్షుడిగా ఆవుల బుచ్చిబాబు యాదవ్‌ నియమితులయ్యారు. ఈ మేరకు పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అధికారిక ఉత్తర్వులు జారీ చేసినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. తన నియామకానికి సహకరించిన పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితకు, గద్వాల నియోజకవర్గ ఇన్‌చార్జి గొంగళ్ల రంజిత్‌ కుమార్‌కు బుచ్చిబాబు యాదవ్‌ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.