అలంపూర్‌: దసరా నవరాత్రి ఉత్సవాల ముగింపు సందర్భంగా అలంపూర్‌ పుణ్యక్షేత్రంలో జోగులాంబ అమ్మవారు, బాలబ్రహ్మేశ్వర స్వామివారి తెప్పోత్సవం వైభవంగా నిర్వహించారు. ప్రత్యేకంగా అలంకరించిన హంస వాహన తెప్పపై స్వామి, అమ్మవార్లను తుంగభద్ర నదిలో విహరింపజేయడంతో భక్తులు భక్తిపారవశ్యంలో మునిగిపోయారు. తెప్పోత్సవాన్ని తిలకించేందుకు వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చారు. విద్యుత్‌ దీపాల వెలుగులతో నదీ తీరం ప్రకాశవంతంగా మారి పండుగ శోభను సంతరించుకుంది. స్వామి, అమ్మవార్ల దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో అలంపూర్‌ క్షేత్రంలో ఆధ్యాత్మిక సందడి నెలకొంది.