రైళ్లలో మొబైల్ స్పీకర్లో పాటలు పెడితే జరిమానా, జైలు శిక్ష
రైళ్లు, రైల్వే స్టేషన్లలో ప్రయాణికులు తమ మొబైల్ ఫోన్లలో స్పీకర్ మోడ్ ద్వారా పాటలు లేదా వీడియోలు పెట్టవద్దని భారతీయ రైల్వే హెచ్చరించింది. దీనిని ఉల్లంఘిస్తే రూ.1,000 వరకు జరిమానా విధిస్తారు. ఈ ఆదేశాలను పదేపదే ఉల్లంఘించే వారికి ఆరు నెలల వరకు జైలు శిక్ష లేదా రూ.5,000 వరకు జరిమానా, లేదా రెండూ విధించే అవకాశం ఉంది. ఇతరులకు అసౌకర్యం కలిగించకుండా ఇయర్‌ఫోన్స్ వాడాలని ప్రయాణికులను రైల్వే శాఖ కోరింది.
