గోషామహల్ స్టేడియంలో పోలీస్ స్మారక పరేడ్..పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి
పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ గోషామహల్ స్టేడియం లో పోలీస్ స్మారక పరేడ్ నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. పోలీస్ అమరవీరులను స్మరించుకుంటూ ఆయన నివాళులర్పించారు. తీవ్రవాదం, నక్సలిజం, మవోయిజం, ఇతర అసాంఘిక శక్తులను ఎదుర్కొనే క్రమంలో వీర మరణం పొందిన ప్రతి పోలీస్‌కు శ్రద్ధంజలి ఘటించారు. తమ కుటుంబాలకు సైతం లెక్క చేయకుండా ధైర్య సాహసాలను ప్రదర్శించి సమాజ శ్రేయస్సు కోసం ప్రాణాలర్పించిన వీరుల సేవలు చరిత్రలో నిలిచి పోతాయని సీఎం రేవంత్ రెడ్డి కొనియాడారు.
