సముద్ర తీరంలో రీల్స్ మోజులో పడి తల్లిదండ్రులు తమ చిన్నారి ప్రాణాలను పణంగా పెట్టారు. అలల తాకిడికి బిడ్డ నీటిలో పడి కొట్టుకుపోతున్నా, వారేమో కెమెరా ముందు నవ్వుతూ వీడియో తీసుకోవడంలో మునిగిపోయారు. అక్కడే ఉన్న ఓ వ్యక్తి అప్రమత్తమై సమయానికి ఆ చిన్నారిని రక్షించడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ వీడియో వైరల్ అవుతోంది. SM పిచ్చిలో పడి కన్నవారే పిల్లల భద్రతను ఇలా గాలికి వదిలేయడంపై నెటిజన్లు మండిపడుతున్నారు...