హైదరాబాద్లో కొత్త బోర్ల తవ్వకంపై నిషేధం.. ఎల్నినో ప్రభావంతో ప్రభుత్వం కీలక నిర్ణయం!
రాబోయే కాలంలో ఎల్నినో ప్రభావం వల్ల తలెత్తబోయే నీటి ఎద్దడి, వర్షాభావ పరిస్థితులను ముందస్తుగా ఎదుర్కొనేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో భవన నిర్మాణాల కోసం కొత్తగా బోరుబావులు తవ్వడానికి ఎలాంటి అనుమతులు ఇవ్వబోమని స్పష్టం చేసింది. అయితే, కేవలం తాగునీటి అవసరాలకి మాత్రమే నిబంధనలకు లోబడి అనుమతిస్తామని తెలిపింది.నిర్మాణ రంగాలు మరియు పరిశ్రమల అవసరాల కోసం తాగునీటిని వృథా చేయకుండా, సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ల (STP) ద్వారా శుద్ధి చేసిన నీటిని సరఫరా చేసేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారు. భూగర్భ జలాలు అడుగంటకుండా, నగరంలో నీటి వనరులను పరిరక్షించే లక్ష్యంతో ప్రభుత్వం ఈ ముందస్తు రక్షణ చర్యలు చేపట్టింది
