ఆసిఫాబాద్ మండలం బూరుగూడ గ్రామంలో సద్దుల బతుకమ్మ సంబరాల్లో విషాదం చోటుచేసుకుంది. బతుకమ్మ ఆడుతున్న సమయంలో చింతలమానేపల్లి మండలం బాబాసాగర్ కు చెందిన శ్రీవాణి(25) స్పృహతప్పి కిందపడింది. స్పృహ తప్పిపోవడంతో వెంటనే ఆసిఫాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించినట్లు స్థానికులు తెలిపారు. చెన్నైలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్నట్లు స్థానికులు తెలిపారు.