నిర్మల్ పట్టణంలోని మారుతి ఇన్‌ హోటల్‌లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్, ఏఐసీసీ పరిశీలకులు సీడీ మేయప్పన్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ.. దేశంలో ఓట్ల చోరీకి వ్యతిరేకంగా మరియు జ్ఞానేశ్ కుమార్ రాజీనామా డిమాండ్‌ను లేవనెత్తుతూ తలపెట్టిన ప్రతిష్టాత్మక 'చలో ఢిల్లీ' ఆందోళన కార్యక్రమంపై చర్చించారు. కేంద్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ నిర్వహించనున్న ఈ భారీ నిరసన ప్రదర్శనకు నిర్మల్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ శ్రేణులు, ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివెళ్లి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.ఈ సమావేశానికి మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తి, మాజీ డీసీసీ అధ్యక్షుడు కూచాడి శ్రీహరి రావు, జిల్లా లైబ్రరీ చైర్మన్ అంజుమన్ అలీ, స్థానిక కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.