369 పబ్లిక్ ఈవీ ఛార్జింగ్ స్టేషన్లకు టీజీ రెడ్కో టెండర్లు

తెలంగాణ : రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) ఛార్జింగ్ మౌలిక సదుపాయాలను విస్తరించేందుకు టీజీ రెడ్కో 369 పబ్లిక్ ఈవీ ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు టెండర్లు ఆహ్వానించింది. ఈవీల ఛార్జింగ్ కోసం యూనిట్‌కు రూ.13 చొప్పున టారిఫ్‌ను నిర్ణయించారు. ఈ ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటులో ప్రైవేట్ రంగానికి పదేళ్లపాటు అవకాశాలు కల్పించనున్నారు. ఇది రాష్ట్రంలో ఈవీ వినియోగాన్ని ప్రోత్సహించడంలో కీలక పాత్ర పోషించనుంది.