4 కిలోల గంజాయి, నాటు తుపాకీ, వేట సామగ్రి, బైక్, ఐదు సెల్‌ఫోన్లు స్వాధీనం దమ్మపేట: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం కొడిశాలగూడెం గ్రామంలో అటవీ జంతువుల వేటకు ఉపయోగించే నాటు తుపాకీ, వేట సామగ్రి, గంజాయి నిల్వ ఉన్నాయనే నమ్మదగిన సమాచారం మేరకు అటవీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో సుమారు 4 కిలోల గంజాయి, ఒక నాటు తుపాకీతో పాటు వేట సామగ్రిని స్వాధీనం చేసుకుని, ఆరుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. దమ్మపేట ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఆధ్వర్యంలో అటవీ సిబ్బంది జె. భద్రయ్య, ఏ. పార్వతి, పి. రాజరమేష్, ఈ. కాంతారావు, డి. నరేష్ కుమార్‌లు కొడిశాలగూడెం గ్రామానికి చెందిన పెనుబల్లి కృష్ణ ఇంటిలో సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటిలో రెండు బ్యాగుల్లో బ్రౌన్ కలర్ కవర్లలో చుట్టి ఉంచిన మూడు గంజాయి కట్టలు లభించాయి.