గ్రామాల్లో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం..
మహబూబాబాద్ జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో గూడూరు సర్కిల్ పరిధిలోని కొత్తగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో రౌతుగూడెం, చింతగట్టు తండా గ్రామాల్లో గురువారం తెల్లవారుజామున 5:30 గంటల నుంచి 7:30 గంటల వరకు కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో 35 మంది పోలీసు సిబ్బంది పాల్గొని సుమారు 120 ఇళ్ల పరిధిలో తనిఖీలు చేపట్టారు. వాహనాలను తనిఖీ చేయడంతో పాటు అనుమానాస్పద వ్యక్తులు, కార్యకలాపాలపై ఆరా తీశారు. సరైన పత్రాలు లేదా నంబర్ ప్లేట్లు లేని 24 వాహనాలను గుర్తించారు. అలాగే 15 లీటర్ల అక్రమ మద్యం (గుడుంబా), సుమారు 500 లీటర్ల బెల్లం వాష్‌ను స్వాధీనం చేసుకుని ధ్వంసం చేశారు.
