కుక్క అడ్డొచ్చి విద్యార్థినికి తీవ్ర గాయాలు
వాల్మీకిపురం: కుక్క ద్విచక్ర వాహనానికి అడ్డు రావడంతో బైక్ అదుపుతప్పి పడి విద్యార్థిని తీవ్రంగా గాయపడిన ఘటన గురువారం వాల్మీకిపురం మండలంలో చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. మదనపల్లె టౌన్ నిమ్మనపల్లి క్రాస్ రోడ్డులో నివాసం ఉంటున్న దివంగత సురేష్ కుమార్ కుమార్తె లినోరా (22) బైక్పై కలికిరి వైపు నాలుగు లైన్ల జాతీయ రహదారిపై వెళుతుండగా, మార్గమధ్యంలోని చింతపర్తి బ్రిడ్జిపై కుక్క అడ్డురావడంతో బైక్ అదుపుతప్పి కిందపడింది. ఈ ప్రమాదంలో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. చింతపర్తి హైవే టోల్ ప్లాజా 1011 పైలట్ సురేష్ కుమార్ బాధితురాలని వెంటనే మదనపల్లి జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించగా చికిత్స పొందుతోంది.
