పాతబస్తీలో రూ.1.20 లక్షల లంచం తీసుకుంటూ విద్యుత్ శాఖ ఏఈ రాకేశ్ ఏసీబీ అధికారులకు చిక్కారు. సంతోష్నగర్ సబ్స్టేషన్ మాదన్నపేట సెక్షన్ TGSPDCL ఏఈగా పనిచేస్తున్న ఆయన, ఆరు కొత్త విద్యుత్ మీటర్ల మంజూరు కోసం ఈ మొత్తాన్ని డిమాండ్ చేశారు. భాదితుడి నుంచి లంచం డబ్బులు తీసుకుంటుండగా అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని కేసు నమోదు చేశారు..!!