ఏసీబీకి చిక్కిన రెవెన్యూ అధికారులు.
మేడ్చల్ జిల్లా : కీసర తహసిల్దార్ కార్యాలయంలో సక్సెషన్ కోసం రూ.5 లక్షలు డిమాండ్ చేశారనే ఆరోపణలకు రూ.2.50 లక్షలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నరు.వివరాల్లోకి వెళ్తే ఇటీవల కీసరకు చెందిన పన్నుల పన్నాల బుచ్చి రెడ్డి భార్య పన్నాల సుశీల మృతి చెందడంతో పన్నాల గిరిధర్ రెడ్డి అనే వ్యక్తి తన తల్లి పేరు మీద ఉన్న సర్వే నెంబర్ 183,184 లో ఉన్న 3-00 ఎకరాల భూమిని సక్సెషన్ కోసం సంబంధిత కార్యాలయాన్ని సంప్రదించడు.ఏసీబీ డీసీపీ ఆనంద్ కుమార్ మాట్లాడుతూ అయితే ఇట్టి భూమి 22A లో ఉంది అని ఈ సక్సెషన్ పూర్తి చేసేందుకు సందీప్ రెడ్డి సుమారు రూ.5 లక్షలు డిమాండ్ చేశారు.22A లో నుండి తీయాలి అంటే తహసిల్దార్ కి ఆర్డీఓ ఆఫీసులో సైతం డబ్బులు ఇవ్వాలి అని బాధితుడికి చెప్పడం జరిగింది.ఈ నేపథ్యంలో పన్నాల గిరిధర్ రెడ్డి రూ 2.50 లక్షలను మొదటగా ఎంఆర్ఓ కార్యాలయంలో విజయ్ కుమార్ రెడ్డికి అందజేసినట్లు సమాచారం.అనంతరం విజయ్ కుమార్ ఆ నగదును కార్యాలయంలో రికార్డు అసిస్టెంట్ గా పేర్కొంటున్న బాలకృష్ణకు ఇచ్చినట్లు తెలిసింది.బాలకృష్ణ ఆ నగదును డిప్యూటీ తహసిల్దార్ సందీప్ రెడ్డి గదిలోకి తీసుకెళ్లి అతని బ్యాగ్ లో పెడుతున్న సమయంలో ఏసీబీ అధికారులు దాడి చేసి పట్టుకున్నరు.
ఈ ఘటనతో సంబంధిత కార్యాలయంలో కలకలం నెలకొంది.సక్సెషన్ వంటి కీలకమైన ప్రభుత్వ సేవల కోసం లంచం డిమాండ్ చేశారనే ఆరోపణలు ప్రజల్లో ఆందోళన కలిగిస్తున్నాయి...
