అయిజలో కాంగ్రెస్‌కు ఏడుగురు కౌన్సిలర్ల రాజీనామా?
మంత్రి జూపల్లి, ఎంపీ మల్లు రవిపై నిరసనగా నిర్ణయం?
అయిజ: జోగులాంబ గద్వాల జిల్లా అయిజ మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఏడుగురు కౌన్సిలర్లు పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసినట్లు సమాచారం. మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎంపీ మల్లు రవి బీఆర్‌ఎస్ నాయకులకు వత్తాసు పలుకుతున్నారనే అసంతృప్తితో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ మేరకు పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్‌కు రాజీనామా లేఖలు పంపినట్లు తెలుస్తోంది. అయితే రాజీనామాలపై అధికారిక ధ్రువీకరణ, పార్టీ నాయకత్వం స్పందన తెలియాల్సి ఉంది.
