శాంతినగర్ లో భారీ చోరీ....30 తులాలబంగారం మాయం
వడ్డేపల్లి: జోగుళాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మున్సిపాలిటీ పరిధిలోని శాంతినగర్ ఇందిరానగర్ కాలనీలో భారీ చోరీ జరిగింది. ఓ ఫంక్షన్‌కు వెళ్లిన భాగ్యమ్మ, మాధవరావు దంపతులు ఇంటికి తిరిగి వచ్చేసరికి దొంగతనం జరిగినట్లు గుర్తించారు.
గుర్తుతెలియని వ్యక్తులు ఇంట్లోకి చొరబడి 30.7 తులాల బంగారం, 1.5 కిలోల వెండి, రూ.14 వేల నగదును అపహరించినట్లు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. చోరీకి పాల్పడిన వారిని గుర్తించేందుకు విచారణ కొనసాగిస్తున్నారు.
