కాంగ్రెస్ పార్టీకి మున్సిపల్ కౌన్సిలర్ల రాజీనామా..?
.జోగులాంబ గద్వాల జిల్లా అయిజ మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఏడుగురు కౌన్సిలర్లు పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసినట్లు సమాచారం. మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎంపీ మల్లు రవి బీఆర్ఎస్ నాయకులకు వత్తాసు పలుకుతున్నారనే అసంతృప్తితో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ మేరకు పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్‌కు రాజీనామా లేఖలు పంపినట్లు తెలుస్తోంది. అయితే రాజీనామాలపై అధికారిక ధ్రువీకరణ, పార్టీ నాయకత్వం స్పందన తెలియాల్సి ఉంది.
